Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడితో వివాహేతర సంబంధం.. మహిళను వివస్త్రను చేసి.. అందరిముందు..?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (11:03 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాశ్చాత్య పోకడలు, స్మార్ట్ ఫోన్ల కాలం కావడంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇందులో భాగంగా నేరాల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోతున్నాయి.


తాజాగా మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళకు దారుణ శిక్ష విధించారు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లైన ఓ మహిళ ... తన మేనల్లుడితో రాసలీలలకు దిగింది. భర్త లేని సమయంలో వీరిద్దరు శారీరకంగా కలిసేవారు.
 
ఈ విషయం కాస్త ఊరిపెద్దలకు తెలియరావడంతో పంచాయితీ పెట్టిన గ్రామస్థులు మహిళకు భయంకరమైన శిక్షవిధించారు. అందరి ముందే ఆమెను వివస్త్రను చేశారు. అంతేకాదు ఆమె జుట్టు కూడా కత్తిరించారు. అయితే ఇందులో తన తప్పేం లేదని, మేనల్లుడే తనతో అలా వున్నాడని తనను బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించింది. మేనల్లుడు మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చాడు. మహిళనే తనను బలవంతంగా ఈ సంబంధంలొకి లాగిందని ఆరోపించాడు.
 
దీంతో బాధిత మహిళను బయటకు ఈడ్చి... ఆమెను వివస్త్రను చేశారు. అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పంచాయతీ పెట్టిన పెద్దల్ని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేశారు. త్వరలో వారందర్నీ అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments