Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులోనే 38 ఏళ్ల మహిళపై అత్యాచారం.. భర్త స్నేహితుడే ఆ పని చేశాడు..

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (18:54 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలకు న్యాయస్థానంలోనూ భద్రత లేదు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో మహిళపై దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని గదిలో 38 ఏళ్ల మహిళపై కోర్టులో పనిచేసే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసిన బాధిత మహిళ.. తనపై అత్యాచారం జరిగినట్టుగా తెలిపారు.
 
లేబర్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో సాయం చేస్తానని నమ్మించి నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధిత మహిళ ఆరోపించారు. మహిళ ఫిర్యాదుతో కోర్టు గదికి చేరుకున్న పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఘటన స్థలంలో ఉన్న నిందితుడిని అరెస్ట్‌ చేశారు.
 
నిందితుడిని రాజేంద్ర సింగ్‌గా గుర్తించామని పోలీసులు చెప్పారు. అతనిపై సెక్షన్‌ 376 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 
 
అయితే బాధితురాలు, నిందితుడు ఒకరిఒకరు ముందే తెలుసునని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు బాధితురాలు భర్తకు కూడా స్నేహితుడేనని పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments