టమోటా కలిపిన మ్యాగీ తిని ముంబై మహిళ మృతి

Webdunia
శనివారం, 30 జులై 2022 (23:03 IST)
ముంబైకి చెందిన ఓ మహిళ మ్యాగీ న్యూడుల్స్‌కి టమోటా కలిపి టేస్ట్ చేసింది. అంతే ప్రాణాలు కోల్పోయింది. ఇదేంటి మ్యాగీలో టమోటా కలిపి తింటే చనిపోతారా అనుకునేరు. 
 
అసలు విషయం ఏంటంటే మృతురాలు ఎలుకను చంపేందుకు టోమాటోలో విషం పెట్టింది. ఈ విషయాన్ని మరిచి అదే టొమాటోను మ్యాగీలో వేసి వండింది. ఇది తిని చనిపోయింది.
 
ముంబైకి చెందిన 27 ఏళ్ల రేఖ అనే మహిళ.. మ్యాగీని తయారు చేస్తుండగా, ఎలుకలు విషం పెట్టిన టొమాటోను పొరపాటున మ్యాగీలో వేసి వండింది. ఈ ఘటన ముంబైలోని మలాడ్ లోని పాస్కల్ వాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
మరుసటి రోజు మ్యాగీ న్యూడిల్స్ తయారు చేసే క్రమంలో.. టీవీ చూస్తూ ఎలుకల విషం పెట్టిన సంగతి మరిచి అదే టొమాటోను మ్యాగీలో వేసింది. దీంతో మ్యాగీని తిన్న సదరు మహిళకు కొన్ని గంటల్లోనే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. 
 
ఆమె భర్త, బావ సమీప ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. ప్రమాదవశాత్తు విషం కలిసిన టొమాటోను మ్యాగీలో కలపడం వల్లే మరణించిందని.. మాల్వాని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments