Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తేనెను వేడిచేసి తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందా?

honey
, శనివారం, 30 జులై 2022 (22:25 IST)
తేనెలో ఎన్నో పోషకాలున్నాయి. ఇటీవలి కాలంలో తేనె వాడకం క్రమంగా పెరిగింది. ఉదయం వేళ తేనె కలుపుకుని గోరువెచ్చని నీళ్లను తాగేవారు వున్నారు. ఐతే తేనెను పొయ్యి మీద పెట్టి వేడి చేయరాదని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. సహజ వైద్యం ప్రభావాలను తేనెను ముడి రూపంలో పొందవచ్చు. ఐతే తేనెను వేడిచేయడం వల్ల అందులో వున్న సమ్మేళనాల రూపం మారిపోతుంది. ఇది ఆరోగ్య ప్రమాదాలకు దారితీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

 
తేనెను వేడి చేయడం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీన్ని ఉడికించడం వల్ల నాణ్యత క్షీణిస్తుంది. దాని అవసరమైన ఎంజైమ్‌లు, పోషకాలను కోల్పోతుంది. వేడిచేసిన తేనె ప్రాణాంతకం కావచ్చు. తేనెను 40 డిగ్రీల సెల్సియస్‌ వరకూ వేడి చేయడం వల్ల ప్రతికూల రసాయన మార్పు వస్తుంది. అది చేదుగా మారుతుంది. వేడి చేయడం వల్ల తేనెలో వున్న ప్రయోజనకరమైన లక్షణాలు నాశనమవుతాయి.

 
ఎందుకంటే ఓ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అప్పటికే వేడి చేయబడి ప్రాసెస్ చేసిన తేనెను కొనుగోలు చేసి తిరిగి దాన్ని వేడి చేస్తే నెగటివ్ ఫలితాలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేసినప్పుడు జిగురుతో సమానంగా మారుతుంది. ఇలాంటి తేనెను తీసుకుంటే... జీర్ణవ్యవస్థలోని జీర్ణం కాని ఆహారంగా... అంటే హానికర పదార్థంగా మార్చేస్తుంది. ఇది అనారోగ్యానికి మూల కారణం అవుతుంది. ఫలితంగా బరువు పెరగడం, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలు, రక్తంలో గ్లూకోజ్ అసమతుల్యతలకు దోహదం చేస్తుంది. తేనెను పాశ్చరైజ్ చేయడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగవచ్చు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. కనుక తేనెను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేయకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షవర్‌లో స్నానం చేస్తున్నారా? అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్సుందట!