ఇష్టపూర్వకంగా సహజీవనం చేసి.. పెళ్లికి నో చెప్పాడని అత్యాచారం కేసు పెట్టడమా? హైకోర్టు ప్రశ్న

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (10:06 IST)
స్వేచ్ఛగా దశాబ్దకాలం పాటు సహజీవనం చేసి, జీవించిన తర్వాత పెళ్ళికి నిరాకరించాడన్న ఏకైక కారణంతో పురుషుడిపై ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. పైగా, ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పదేళ్లకు పైగా స్వేచ్ఛగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని, పిటిషనర్‌పై (పురుషుడు) అత్యాచారం కేసు నమోదు చేయడం సమర్థనీయం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఉందని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు. ఈ మేరకు పిటిషనర్‌‍పై కేసు కొట్టివేయాలంటూ జులై 2న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 'ప్రతివాది (మహిళ) ఫిర్యాదు, ఐపీసీలోని సీఆర్పీసీ 164 కింద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 375 కింద దీనిని రేప్ కేసుగా పరిగణించలేము అనేది నా అభిప్రాయం. ఈ కేసు విచారణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది' అని జస్టిస్ సంజయ్ ద్వివేది వ్యాఖ్యానించారు.
 
స్త్రీ, పురుషుడు ఇద్దరూ బాగా చదువుకున్న వ్యక్తులు అని, ఏకాభిప్రాయంతో ఇద్దరూ 10 ఏళ్లకుపైగా శారీరక సంబంధాన్ని కొనసాగించారని తేలిందని కోర్టు వెల్లడించింది. ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోబోనని నిరాకరించడంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయిందని, పురుషుడిపై అత్యాచారం కేసు నమోదు చేయడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
స్త్రీని బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ కూడా పురుషుడిపై కేసు పెట్టలేమని (ఐపీసీ సెక్షన్ 366) కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి పురుషుడిపై ఆ తర్వాతి కాలంలో ఐపీసీ సెక్షన్ 366 కింద పెట్టిన కేసును కూడా రద్దు చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
 
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 2021లో ఈ కేసు నమోదైంది. అత్యాచారం, ఇతర అభియోగాల కింద వ్యక్తిపై ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. అయితే తనపై కేసులు అక్రమమని, తనకు ఉపశమనం కల్పించాలంటూ పురుషుడు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments