Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50మందిని పెళ్లాడిన మహిళ!!

Advertiesment
woman

వరుణ్

, ఆదివారం, 7 జులై 2024 (11:11 IST)
woman
అవును మీరు చదువుతున్నది నిజమే. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50మందిని వివాహం చేసుకుంది. ఈ 50మందిలో ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు కూడా వున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు - తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్ ‌సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.
 
పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది.. దీంతో అతను అడగగా సంధ్య చంపేస్తానని బెదిరించింది. అయినా ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విచారణలో అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుగుల మందు తాగిన అశ్వారాపుపేట ఎస్ఐ మృతి.. కులం పేరుతో వేధింపులే..?