Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుగుల మందు తాగిన అశ్వారాపుపేట ఎస్ఐ మృతి.. కులం పేరుతో వేధింపులే..?

Advertiesment
Police

వరుణ్

, ఆదివారం, 7 జులై 2024 (10:52 IST)
Police
పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను (38) మృతి చెందారు. పోలీస్ ఉన్నధికారులు, కిందిస్థాయి సిబ్బంది వేధింపులు, కులవివక్ష వేధింపులను భరించలేని శ్రీరాములు జూన్ 30వ తేదీన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 
 
ఆ సమయంలో ఆయనను గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శ్రీరాములు ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
కాగా, తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ఉన్నతాధికారులో కారణమని పేర్కొంటూ ఆయన భార్య కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగురాహులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 23న 2024-25 కేంద్ర బడ్జెట్‌ - పేదరికంపై పోరాటం.. మోదీ మాటలు