Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రైల్వే స్టేషన్‌లో అలా.. ముంబై మెట్రో స్టేషన్‌లో ఇలా..? ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (22:39 IST)
నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళను కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని కలబురగి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళను రక్షించిన వెంటనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
రైలు కదులుతున్న సమయంలో మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్య మహిళ కాలు తప్పి జారిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించారు. రైలును ఆపాలని సూచనలు చేశారు. అనంతరం ఆ మహిళను రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
 
అయితే ముంబైలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ముంబై మెట్రో వన్ రైలులో తాళం వేసి ఉన్న డోర్‌లలో ఓ మహిళ దుస్తులు ఇరుక్కుపోయాయి. రైలు కదులుతుండటంతో ఆ మహిళ అలా రైలు ప్లాట్‌ఫారమ్ చివరకు ఈడ్చుకెళ్లింది.  ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో ఒక వ్యక్తి ఆమెను రక్షించడానికి ప్రయత్నించడం కూడా చూడవచ్చు, కానీ అతను విఫలమయ్యాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. లోకో పైలట్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆమెకు చికిత్స అందించేందుకు మెట్రో అధికారులు ముందుకొచ్చారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments