Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమండ్రిలో సీఎం జగన్ సభ వద్ద అపశృతి

Advertiesment
old woman
, మంగళవారం, 3 జనవరి 2023 (14:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాజమండ్రి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే, ఇక్కడ అపశృతి చోటు చేసుకుంది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన వైఎస్ఆర్ పింఛను కానుక సభకు 70 యేళ్ల వృద్ధురాలు కూడా విచ్చేశారు. 
 
ఈ వృద్ధురాలు బస్సు దిగుతుండగా జారి కిందపడ్డారు. సభాస్థలి వద్ద బస్సు దిగుతుండగా బస్సు కదిలి ఆమెను ఢీకొట్టడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో బస్సు ఆమె కాళ్ళపై నుంచి వెళ్లింది. ఫలితంగా కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కాకినాడలోని ప్రభుత్వం జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
సభలు, ర్యాలీలు, రోడ్డు షోలపై మార్గదర్శకాలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్‌షోలకు ప్రజలు విపరీతంగా తరలి వస్తున్నారు. దీంతో కందుకూరులో తొక్కిసలాట చోటు చేసుకుంది. అలాగే, గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సభకు కూడా భారీసంఖ్యలో ప్రజలు వచ్చారు. ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఈ రెండు ప్రమాదాల్లో పది మంది వరు ప్రాణాలు కోల్పోయారు. 
 
పైగా, ఒక్క పైసా డబ్బు పంచకుండానే జనాలు విపరీతంగా తరలి వస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలకు నిద్రపట్టడంలేదు. దీంతో ఏ విధంగా చంద్రబాబు రోడోషోలను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఇందులోభాగంగా, రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలు నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్‌షోలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ఏపీ హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
 
ఈ ఆదేశాల మేరకు మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీస్ యాక్ట్ నిబంధనలను వర్తింపజేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రోడ్డుకు దూరంగా ప్రజలు ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. సభలు, రోడ్‌షోలు నిర్వహించే రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రదేశాల ఎంపికపై సూచనలు పంపికపై సూచనలు పంపారు. ట్రాఫిక్‌కిు ఇబ్బంది కలిగించకుండా చూడాలని హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇబ్బంది లేని ప్రదేశాల్లో సభల నిర్వహణకు అనమతి ఇవ్వాలని నిర్ణయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థులకు శుభవార్త.. ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగింపు