Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిని ప్రియురాలికి రాస్తాడనీ... కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్త హత్య

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (14:51 IST)
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్త తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా, ఆమెతోనే ఎక్కువగా ఉండసాగాడు. దీంతో ఆస్తి మొత్తాన్ని ఆమె పేరుమీదరాస్తాడన్న సందేహం ఉత్పన్నమైంది. ఈ అనుమానం కాస్త పెనుభూతమైంది. అంతే.. కాంట్రాక్టు కిల్లర్లతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి పడేశారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన జోగీందర్ అనే వ్యక్తి స్వీటి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్ళికి ముందు నుంచే తన భర్తకు వివాహేతర సంబంధం ఉండేదని భార్య అనుమానిస్తూ ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆస్తి మొత్తాన్ని సదరు మహిళకే ఇచ్చేస్తాడని భయపడిన ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లతో బెదిరించాలని ప్లాన్ చేసింది. 
 
ఇందుకోసం రూ.16 లక్షలకు సుపారీ మాట్లాడుకుంది. ముందుగా రూ.2.5 లక్షలు చెల్లించింది. అయితే, కాంట్రాక్టు కిల్లర్లు మాత్రం ఏకంగా జోగీందర్‌ను హతమార్చారు. ఈ హత్య ఈనెల 17వ తేదీన జరుగగా, మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి, ఎవరికీ తెలియని ప్రదేశంలో పడేశారు.
 
ఈ నేపథ్యంలో తన సోదరుడు కనిపించకపోవడంతో జోగీందర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేసమయంలో బజ్‌గేరా ప్రాంతంలో ఓ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చనిపోయిందని జోగీందరే అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తమదైనశైలిలో విచారణ జరిపారు. ఈ విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో స్వీటిని అరెస్టు చేయగా, కాంట్రాక్టు కిల్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments