Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబ్బాకలో గెలుపు బీజేపీకి బూస్టింగ్ వంటిది: కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (23:02 IST)
దుబ్బాక గెలుపుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌కు పట్టున్న దుబ్బాకలో గెలవడం తమ పార్టీకి బూస్టింగ్ వంటిదని పేర్కొన్నారు. దుబ్బాకలో గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  పనిచేయడానికి ఇంకా ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. ఎక్కడైనా అభ్యర్థి ప్రాధాన్యతగానే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
 
దుబ్బాక, బీహార్ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. ఏపీ బీజేపీ అభ్యర్థులు సోము వీర్రాజు కుల, మతాలకు అతీతమైన విజయాన్ని ప్రజలు మోదీకి అందించారన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏపీలో ఇలాంటి విజయాలే చూస్తారన్నారు. దీంతో విజయవాడ బీజేపీ కార్యాలయం ఎదుట బాణ సంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
 
అటు 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో అధికారంలోకి వస్తామంటున్నారు. ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన బీజేపీ దుబ్బాకలో మొదటిసారి విజయకేతనం ఎగురవేసింది. 14 వందల ఓట్లకు పైగా తేడాతో టీర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను బీజేపీ అభ్యర్థి రఘునంధన్ రావు ఓడించారు.
 
మొత్తం 23 రౌండ్లలో సాగిన ఓట్ల లెక్కింపులో రఘునంధన్ రావుకు 62,772 ఓట్లు రాగా సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్జికి 21,819 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతంలో బీజేపీకి 39 శాతం, టీఆర్ఎస్‌కు 37 శాతం వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments