Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ వస్తే గెలుస్తారా? స్టాలిన్ వస్తే ఓడిపోతారా? అన్నాడిఎంకె సెటైర్లు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:35 IST)
తమిళనాడు ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. సాధారణంగా రెండు పార్టీల నేతలు ఎదురుపడితే తమిళనాడులో గొడవలు మామూలుగా ఉండవు. అలాంటిది తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారుతోంది. అసలు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ప్రచారం చేయాలంటున్నారు తమిళ తంబీలు.
 
మేము పోటీ చేసే నియోజకవర్గాల్లోకి ప్రధాని వస్తే మా విజయం ఖాయమంటూ డిఎంకే నేతలు ట్విట్టర్ వేదికగా సందేశాలు పంపుతున్నారు. కంబం డిఎంకే అభ్యర్థి ఎన్.రామక్రిష్ణన్ ఒక ట్వీట్ చేశారు. అయ్యా నేను డిఎంకే అభ్యర్థిని. మీరు ఇక్కడకు వచ్చి ప్రచారం చేస్తే నేను సంతోషిస్తాను. 
 
మీరు బిజెపి, అన్నాడిఎంకే కూటమిలో ప్రచారం చేస్తే నా విక్టరీలో మార్జిన్ పెరుతుందంటూ ట్వీట్ చేశారు. అలాగే ఐదుసార్లు తిరువణ్ణామలై నుంచి ఎమ్మెల్యేగా సేవలందించిన ఇ.వి. వేలు కూడా మరోసారి డిఎంకే నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఇలాంటి అర్జీనే పెట్టుకున్నారట. 
 
ఇలా డిఎంకేకు చెందిన చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఈవిధంగానే అర్జీలు పెట్టుకున్నారట. దీంతో తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానమంత్రినే టార్గెట్ చేస్తూ డిఎంకే చేస్తున్న ప్రచారం మరో రకంగా బూమ్ రాంగ్ అవుతోందంటున్నారు. ప్రధాని రాకపోతే ఓడిపోతారా... డీఎంకె పార్టీలో గెలిపించగల ప్రచారకర్తలు లేరా అని అన్నాడీఎంకె నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments