Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భంతో వున్నప్పుడు శృంగారం.. రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రెగ్నెంట్.. కవలలు పుట్టారు?!

Advertiesment
Mother
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (12:07 IST)
Twins
ఇంగ్లండ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ రోజుల వ్యవధిలోనే రెండు సార్లు గర్భం దాల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లండ్​లోని బాత్​కు చెందిన రెబెక్కా రాబర్డ్స్(39)​ అనే మహిళ కొద్ది నెలల క్రితం గర్భం దాల్చింది. అయితే, ఆమె కడుపుతో ఉండగానే తన భర్తతో శృంగారంలో పాల్గొంది. దీంతో ఆమె రోజుల వ్యవధిలోనే మరోసారి గర్భం దాల్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్​ 17వ తేదీన బాత్​లోని యునైటెడ్​ హాస్పిటల్​లో ఆమె ఆశ్చర్యకరంగా ఒకేసారి ఆడ, మగ బిడ్డలకు జన్మనిచ్చింది.
 
ఆడ బిడ్డకు రొసలీ అని పేరు పెట్టగా.. మగ బిడ్డకు నోవా అని పేరు పెట్టారు. ఆడ బిడ్డతో పోల్చుకుంటే మగ బిడ్డ పరిమాణంలో చాలా చిన్నగా బలహీనంగా జన్మించాడు. దీనికి కారణం ఆ బిడ్డ నెలలు నిండకుండా పుట్టడమే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆ బాలున్ని 95 రోజుల పాటు హాస్పిటల్​లోనే ఉంచి చికిత్స చేయించారు.
 
ప్రస్తుతం ఆ బాలుడు కోలుకొని ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు. కాగా, ఆ మగ బిడ్డకు ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ మరో మూడు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారు. గర్భంతో ఉండగానే మరోసారి గర్భం దాల్చడం అరుదైన సంఘటన అని.. ఇది సూపర్​ఫెటేషన్​ కారణంగానే జరిగిందని వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, నివేదికల ప్రకారం ఇటువంటి అరుదైన ఘటనలు ప్రపంచంలో 0.3% మంది మహిళల్లో మాత్రమే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కానీ, ఇలా జరిగిన చాలా సందర్భాలలో, రెండో శిశువు గర్భధారణ సమయంలోనే మరణిస్తుంది.
 
కానీ, రెబెక్కా రాబర్డ్స్​కు జన్మించిన రెండో శిశువు కూడా ఆరోగ్యంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు, ఆమె ప్రెగ్నెన్సీ కోసం వాడిన మందుల వల్లే ఇలా డబుల్​ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. రెబెక్కా తీసుకున్న మందుల ఫలితంగా ఆమె గర్భంలో మరో అండం విడుదలై ఉంటుందని.. అందుకే ఆమె మళ్లీ గర్భం దాల్చిందని వైద్యులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ ఒకటో తేదీ.. క్యాలెండర్‌లో తేదీనే కాదు... పెను మార్పులకు నాందికూడా..