Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల పాపపై మూడు వీధికుక్కలు పడ్డాయి.. ఏడుపు శబ్ధం విని..?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (13:34 IST)
నాలుగేళ్ల పాప వీధికుక్కల దాడికి గురైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఒకటి కాదు.. ఏకంగా మూడు కుక్కలు నాలుగేళ్ల పాపపై దాడికి దిగడంతో ఆ పాప వాటి నుంచి తప్పించుకోలేక ఏడ్వసాగింది. కేకలు పెట్టింది. ఆ పాప ఏడుపులు విని స్థానికులు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆ కుక్కలను తరిమికొట్టారు. పాపను రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక బస్ డిపో ముందు ఉన్న కాలనీలో ఘోరం జరిగింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 
 
నందిని అనే నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళ్తోంది. ఆమె వెళ్తున్న రోడ్డు పక్కన ఓ కుక్క ఉంది. ఆ పాప దాన్ని అసలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లసాగింది. ఇంతలోనే ఊహించని రీతిలో ఆ కుక్క నందినిపై దాడి చేసింది. పాపను నోట పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లిపోసాగింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఈడ్చుకెళ్లింది. ఆ కుక్కకు తోడు మరో మూడు కుక్కలు కూడా తోడవడంతో పాప భయాందోళనకు గురయింది.
 
కుక్కలు తనపై దాడి చేస్తోంటే ఏం చేయాలో తెలియక, వాటిని ప్రతిఘటించలేక గుక్కపట్టి ఏడవసాగింది. ఆ పాప ఏడుపులు విన్న స్థానికులు ఉరుకులు పరుగుల మీద ఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కలను తరిమి కొట్టారు. ఆ పాపను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెంటనే తరలించారు. పాప కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్టు గుర్తించారు. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డయింది. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments