Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతపు పెళ్లి చేస్తున్నారు... ఏం చేస్తానో చూడండి.. తల్లికి సోనమ్ వార్నింగ్

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (11:32 IST)
నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు... ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూడు ఉంటూ తన తల్లిని సోనమ్ రఘువంశీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీతో తనకు పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సోనమ్ తన తల్లిని ముందే హెచ్చరించిందట. 
 
నాకు ఇష్టంలేదని చెబుతున్నా వినికుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. తర్వాత మీరే విచారిస్తారు అని సోనమ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజ్ కుశ్వాహాను ప్రేమిస్తున్నా అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినా సోనమ్ తల్లి వినిపించుకోలేదట. తన ప్రేము అంగీకరించలేదని, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సోనమ్ ఆగ్రహంతో రగలిపోయిందని సమాచారం. 
 
"నేను ఆ మనిషి (రాజా రఘువంశీ)ని ఏ చేస్తానో చూడండి. దాని పర్యావసానాలు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది" అంటూ సోనమ్ తన తల్లిని బెదిరించింది. అయినా తల్లి వినకపోవడంతో బలవంతంగా తాళి కట్టించుకున్న సోనమ్... ఆ తర్వాత వారం రోజులకే రాజా రఘువంశీని హత్య చేయించింది. తాజాగా ఈ వివరాలను రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు వచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, ఇలా హత్య చేయిస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. 
 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్ రఘువంశీ (24), రాజా రఘువంశీ (29)లకు మే 11వ వివాహం జరిగింది. అయితే, తమ కుటుంబ వ్యాపారంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న రాజ్ కుష్వాహాతో సోనమ్‌కు అంతకుముందే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయాన్ని సోనమ్ తన తల్లికి చెప్పి, రాజాను పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అయినప్పటికీ తల్లి ఆమె ప్రేమను వ్యతిరేకించింది. కుమార్తెకు నచ్చజెప్పి తమ కులానికి చెందిన రాజాతో పెళ్లి చేసింది. 
 
పెళ్లయిన తర్వాత మే 23వ తేదీన రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ ఓ హోమ్‌స్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరూ అదృశ్యమయ్యారు. మొదట దంపతులు కనపడటం లేదని కేసు నమోదు కాగా, జూన్ 2వ తేదీన రాజా మృతదేహం లభించడంతో ఈ కేసు దారుణమైన మలుపు తిరిగింది. విచారణలో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments