ప్రియురాలి మరణం: చితి మంటల్లోకి దూకి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

సెల్వి
బుధవారం, 11 జూన్ 2025 (10:46 IST)
నాగ్‌పూర్ సమీపంలో ప్రియురాలి మరణంతో యువకుడి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ప్రేమించిన యువతి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ యువకుడు ఆమె చితి మంటల్లోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. 
 
ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పరిధిలోని కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ప్రియుడితో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఆమె ఆకస్మిక మరణంతో దిగ్భ్రాంతికి గురైన యువకుడు ఆమెను కోల్పోయానన్న బాధను తట్టుకోలేకపోయాడు. మద్యం తాగి ఆమె అంత్యక్రియలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు.
 
అక్కడ కాలుతున్న ప్రియురాలి చితిని చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా ఆ చితి మంటల్లోకి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కన్హాన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments