Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీలో వచ్చే క్రైమ్ పాట్రోల్ సీరియల్ చూసి భర్తను చంపిన భార్య

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:09 IST)
ఓ మహిళ టీవీ టీవీ సీరియల్ చూసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. ఈ దారుణం‌ గ్వాలియర్‌‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్వాలియర్‌కు సమీపంలోని బహోదాపూర్‌కు చెందిన మమత, తన భర్త పరశురామ్ చేతిలో ఎప్పటి నుంచో వేధింపులకు గురవుతోంది. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు అనుభవిస్తోంది. 
 
ఆ వేధింపులు భరించలేక తన భర్తను చంపెయ్యాలని నిర్ణయించుకుంది. ఈ నెల 2వ తేదీన జరిగిన గొడవలో తాగి ఉన్న భర్త తలపై ఓ రాయితో మోది చంపేసింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసింది. ఆ తర్వాత బయటకు గట్టిగా అరుచుకుంటూ వచ్చి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుపు మొదలుపెట్టింది. ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. 
 
భర్త మృతి కారణంగా షాక్‌లోకి వెళ్లిపోయినట్టు నటించింది. మమతను చూసి అందరూ జాలి పడ్డారు. పోలీసులు కూడా ఆమె చెప్పేదే నిజమని నమ్మారు. అయితే 28 రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రావడంతో అసలు విషయం బయటపడింది. 
 
పరశురామ్ తలపై గాయం అయినట్టు తేలింది. దీంతో పోలీసులు మమతను విచారించగా ఆమె తన నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి అసలు విషయం చెప్పింది. భర్త వేధింపులు భరించలేక తానే అతడిని చంపినట్టు అంగీకరించింది. టీవీలో వచ్చే -క్రైమ్ పాట్రోల్- సీరియల్ చూసి హత్య చేసినట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments