Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి టెక్కీ భువనేశ్వరి హత్య కేసులో భర్త అరెస్టు

Advertiesment
Techie Bhuvaneswara
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్ అయ్యాడు. ఇటీవల తిరుపతిలో భువనేశ్వరి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో భర్త శ్రీకాంతరెడ్డిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా నెల్లూరు వద్ద శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కట్టుకున్నోడే హంతకుడు... 
 
తిరుప‌తిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన యువ‌తి మృత‌దేహం ద‌హ‌నం కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కుడే ఆమెను హ‌త్య చేశాడ‌ని తేల్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుప‌తి రుయా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల‌ కాలిన స్థితిలో ఓ మృత‌దేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన స్థానిక పోలీసులు.. అది పుంగ‌నూరు మండ‌లం రామ‌సముద్రానికి చెందిన భువ‌నేశ్వ‌రి మృత‌దేహంగా గుర్తించారు. 
 
దీంతో పోలీసుల విచార‌ణ‌లో పలు అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. భువ‌నేశ్వ‌రిని ఆమె భ‌ర్త శ్రీ‌కాంత్ రెడ్డి హ‌త్య చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. భార్య‌ను ఇంట్లో హ‌త్య చేసి రుయా ఆసుప‌త్రి ఆవరణలో మృతదేహాన్ని శ్రీ‌కాంత్ రెడ్డి త‌గ‌ల‌బెట్టినట్లు తేలింది. 
 
రెండున్న‌రేళ్ల క్రితం వారిద్ద‌రు ప్రేమ‌ వివాహం చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఈ రోజు సాయంత్రం మీడియాకు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పట్లో ప్రత్యక్ష క్లాసులు లేన్నట్టే.. ఆన్‌లైన్‌లోనే బోధన : తేల్చి చెప్పిన మంత్రి సబిత