Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (20:31 IST)
Marriage
ప్రియుడి కోసం భర్తకు పెళ్లైన మొదటి రోజే షాకిచ్చింది ఓ నవవధువు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరుకు చెందిన కలైయరసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న వివాహం జరిగింది. అదే రోజు నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. 
 
అయితే శోభనం గదిలోకి వెళ్లగానే నవ వరుడికి షాక్ తప్పలేదు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నవవధువు చెప్పింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు తన ప్రియుడితోనే సంసారం చేస్తానని తెగేసి చెప్పేసింది. భర్త ముందే వీడియో కాల్ ద్వారా ప్రియుడితో మాట్లాడింది. దీంతో వరుడు ఏం చేయాలో తెలియక శోభనం గది నుంచి బయటికి వచ్చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు. 
 
ఫిబ్రవరి 12 భార్యను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లాడు. కానీ నవ వధువు కుటుంబీకులు కలైయరసన్ ఆమెతోనే సంసారం చేయాలని చెప్పి పంపారు. ఇంతటితో ఈ కథ ముగిసిందనుకుంటే.. మూడు రోజుల తర్వాత భర్తకు జ్యూస్‌లో భార్య విషం కలిపి పెట్టింది. 
 
వెంటనే కలైయరసన్ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. నవ వధువుపై కలైయరసన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments