Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు ప్రియులతో సుఖం, భర్తను మూడు ముక్కలు చేసిన భార్య..

ప్రేయసి లేదా ప్రియుడు. ఒకరి ఒక్కరే వుండటాన్ని మనం చూస్తుంటాం. కానీ ఆమెకు మాత్రం నలుగురు ప్రియులు. మరింత విడ్డూరం ఏమిటంటే... ఆమె నలుగురు ప్రియులు అంతా కలిసే వుండటం. తన ప్రియుళ్ల సుఖం కోసం భర్తను మూడు ముక్కలుగా నరికించి హత్య చేసిన దారుణమైన ఘటన ఆలస్యంగా

Webdunia
గురువారం, 10 మే 2018 (13:58 IST)
ప్రేయసి లేదా ప్రియుడు. ఒకరి ఒక్కరే వుండటాన్ని మనం చూస్తుంటాం. కానీ ఆమెకు మాత్రం నలుగురు ప్రియులు. మరింత విడ్డూరం ఏమిటంటే... ఆమె నలుగురు ప్రియులు అంతా కలిసే వుండటం. తన ప్రియుళ్ల సుఖం కోసం భర్తను మూడు ముక్కలుగా నరికించి హత్య చేసిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... గోవాలో ఈ నెల 1వ తేదీన ఓ వ్యక్తి పోలీసులకు ఓ సమాచారం అందించాడు. తను ఓ హత్యను కళ్లారా చూసినట్లు చెప్పాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలను కనుగొని షాక్ తిన్నారు.
 
కర్ణాటక పరిధిలోని బైల్ హోగెనల్‌కు చెందిన 38 ఏళ్ల బసవరాజ్ బారి, 30 ఏళ్ల కల్పన దంపతులు. బ్రతుకు దెరువు కోసం వీరిద్దరూ గోవాకు మకాం మార్చారు. ఈ క్రమంలో కల్పనకు రాజస్థాన్‌కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్‌కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్‌లతో స్నేహం కుదిరింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఒకళ్లు కాదు నలుగురితో ఎఫైర్ సాగిస్తుండటంతో భర్తకు అనుమానం వచ్చి నిలదీశాడు. 
 
భర్త పదేపదే హెచ్చరికలు చేస్తుండటంతో ఇక లాభంలేదని అతడిని లేపేయాలని ప్లాన్ వేసింది. ఆ క్రమంలో తన నలుగురు ప్రియులను పిలిపించి పక్కా ప్రణాళిక వేసింది. తన భర్తను తాళ్లతో కట్టేసి అంతా కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి మృత దేహాన్ని మూడు ముక్కలు చేసి బ్యాగులో సర్దేసి వేర్వేరు ప్రాంతాల్లో పడవేయించింది కల్పన. దీనితో పొరుగునే వున్న ఓ వ్యక్తి కల్పన భర్త కనబడకపోయేసరికి విషయాన్ని పోలీసులకు తెలుపడంతో ఈ దారుణం వెలుగుచూసింది. నిందితుల్లో ఒకర్ని తప్ప అందర్నీ అరెస్టు చేశారు పోలీసులు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments