Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ పేరుపెట్టాలా? క్రిస్టియన్ పేరు పెట్టాలా?.. కోర్టుకెక్కిన తల్లిదండ్రులు

తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుడు పేరు లేదా పూర్వీకుల పేరు, లేదంటే తమకు నచ్చిన పేరు నామకరణం చేయడం ఆచారం. కానీ, కేరళలో జన్మించిన బిడ్డకు నామకరణం విషయంలో తల్లిదండ్రులు గొడవ పడి కోర్టు మెట్లు ఎక్కారు. వివరాలు పరిశీలిస్తే... కేరళలోని కొట్టాయంకు చెందిన హిం

Webdunia
గురువారం, 10 మే 2018 (13:41 IST)
తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుడు పేరు లేదా పూర్వీకుల పేరు, లేదంటే తమకు నచ్చిన పేరు నామకరణం చేయడం ఆచారం. కానీ, కేరళలో జన్మించిన బిడ్డకు నామకరణం విషయంలో తల్లిదండ్రులు గొడవ పడి కోర్టు మెట్లు ఎక్కారు. వివరాలు పరిశీలిస్తే... కేరళలోని కొట్టాయంకు చెందిన హిందువు అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయికి 2010 ఆగష్టు 29న వివాహం జరిగింది. 
 
క్రిష్టియన్, హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే రెండో పిల్లవాడి పేరు పెట్టే విషయంలో దంపతులు ఇద్దరూ గొడవపడ్డారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి అభినవ్ సచిన్ అని నామకరణం చేస్తే తల్లి అంగీకరించలేదు. అభినవ్ స్థానంలో జాన్‌మణి పేరు చేర్చి జాన్‌మణి సచిన్ అని తల్లి సూచించింది. పేరు విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగి కోర్టులో ఇరువురు పిటిషన్ దాఖలు చేశారు. వీరి వాదనలు విన్న  న్యాయమూర్తి తానే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికి ఇబ్బంది లేకుండా "జాన్ సచిన్" అనే పేరును నామకరణం చేశాడు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments