Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడు మడ్డు శివ కోసం భర్త శంకర్‌ను హత్య చేయించింది... అత్తమామలు షాక్...

ఆమె చిన్నతనం నుంచీ తాతయ్య వాళ్ల ఇంట్లోనే పెరిగింది. చదువు దగ్గర్నుంచి జల్సాల కోసం కావాల్సిన డబ్బంతా బావ పంపించేవాడు. అన్నీ తానై చూసుకున్న ఆ బావనే ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. ఐతే బావ గౌరీ శంకర్ అంటే ఆమెకు ఇష్టం లేదు. ఎందుకంటే బావ ఇచ్చిన డబ్బుతో హ్యాప

Advertiesment
Vijayanagaram Crime
, బుధవారం, 9 మే 2018 (14:51 IST)
ఆమె చిన్నతనం నుంచీ తాతయ్య వాళ్ల ఇంట్లోనే పెరిగింది. చదువు దగ్గర్నుంచి జల్సాల కోసం కావాల్సిన డబ్బంతా బావ పంపించేవాడు. అన్నీ తానై చూసుకున్న ఆ బావనే ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. ఐతే బావ గౌరీ శంకర్ అంటే ఆమెకు ఇష్టం లేదు. ఎందుకంటే బావ ఇచ్చిన డబ్బుతో హ్యాపీగా జల్సాలు చేస్తూ మరో యువకుడు మడ్డు శివ ప్రేమలో పడిపోయింది. ఐతే ఆ విషయాన్ని ఎవ్వరకీ చెప్పలేదు. బావ తనకోసం అన్నీ ఇచ్చాడు కాబట్టి పెళ్లి చేసుకుని ఆపై అతడిని పైకి పంపించే ఏర్పాటయితే చేసేసింది. 
 
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన నవ వరుడి హత్యకేసులో తేలిన అసలు విషయం ఇదే. తొలుత నగల కోసం హత్య జరిగిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది సరస్వతి. ఐతే ఆ తర్వాత అది అంతా ఉత్తదేనని నిందితులు పట్టుబడ్డాక తేలింది. ప్రియుడు శివ ద్వారా మెరుగు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజులను కలిసి తన భర్తను చంపేందుకు 8 వేల రూపాయలతో పాటు ఓ బంగారు వుంగరాన్ని సుపారీగా ఇచ్చింది. 
 
ఆమె ఇచ్చిన పైకంతోపాటు శివ కూడా మరో రూ.10 వేలు ఇచ్చాడు. అలా పథకం ప్రకారం శంకర్ ను హత్య చేయించింది. ఐతే అన్నీ తానై చూసుకున్న గౌరీ శంకర్‌ను హత్య చేయించేందుకు చేతులు ఎలా వచ్చాయోనని భోరున విలపించారు శంకర్ తల్లిదండ్రులు. ఇష్టం లేకపోతే తనకు వద్దని చెప్పవచ్చు కదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే ఓటుకు నోటు కేసుపై సమీక్ష.. కేసీఆర్‌ను నడిపేది మోదీనే: రేవంత్ రెడ్డి