Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్ణీత సమయానికి ముందుగానే వచ్చిన రైలు.. డ్యాన్స్ చేసిన ప్రయాణికులు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (13:33 IST)
సాధారణంగా దేశంలో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తాయనే ప్రచారం ఉంది. "నేను ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు" అని ప్రముఖ సినీ కవి ఆరుద్ర అన్నారు కూడా. అనేక సందర్భాల్లో భారతీయ రైళ్ళ రాకపోకలను చూస్తే ఇది నిజమేనని నిరూపితమైన సంఘటనలు అనేక ఉన్నాయి. అయితే, ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. నిర్ణీత సమయం లేదా దానికంటే ముందుగానే రైళ్లు స్టేషన్లకు వచ్చి ఆగుతున్నాయి. 
 
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లాం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ రైలు నిర్ణీత సమయానికంటే 20 నిమిషాలు ముందుగా వచ్చి ఆగింది. బాంద్రా - హరిద్వార్ రైలు రాత్రి 10.35 గంటలకు స్టేషన్‌కు వచ్చి 10 నిమిషాలు ఆగుతుంది. కానీ, బుధవారం రాత్రి ఈ రైలు ఏకంగా 20 నిమిషాలు ముందుగానే స్టేషన్‌కు వచ్చి ఆగింది. 
 
దీంతో ప్రయాణికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులయ్యారు. స్టేషన్‌లో 30 నిమిషాల పాటు రైలు ఆగడంతో ప్రయాణికులంతా రైలు దిగి ఆ రాష్ట్ర సంప్రదాయ గర్భా నృత్యంతో ఆలరించారు. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments