Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజ‌య‌వాడ‌లో కొత్త‌గా 60 చెత్త సేకరణ వాహనాల‌ ప్రారంభం

విజ‌య‌వాడ‌లో కొత్త‌గా 60 చెత్త సేకరణ వాహనాల‌ ప్రారంభం
విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (19:28 IST)
విజ‌య‌వాడ నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  సోమవారం సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య అవుట్ డోర్ స్టేడియంలో కొత్త చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌ను ప్రారంభించారు. చెత్త సేకరణ వాహనాల ప్రారంభ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన‌గా, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి తో కలసి వాటిని లాంఛనంగా ప్రారంభించారు.  
 
 
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణకు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా నగరానికి 225 వాహనాలు కేటాయించింద‌ని అన్నారు. నగర పరిధిలోని నాలుగు శానిటరీ సర్కిల్స్ కు 15 చొప్పున వాహనాలు అందించారు. వాహనములపై విధులు నిర్వహించే సిబ్బంది, వాటిని తమ సొంత వాహనంగా భావించి జాగ్రత్తగా వినియోగించాలని అన్నారు. అధికారులు కూడా నిత్యం క్షేత్ర స్థాయిలో ఆ వాహనాలను పరిశీలిస్తూ, చెత్త సేకరణతో పాటు,  వాహనాలకు అమర్చిన మైక్ ద్వారా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా చూడాలని సూచించారు.
 
 
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొహమ్మద్ షహీనా సుల్తానా, కొండాయగుంట మల్లీశ్వరి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్, డా.ఇక్బాల్ హుస్సేన్, డా.రామకోటేశ్వరరావు, డా.శ్రీదేవి, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ  ఇన్స్ పెక్టర్లు, సచివాలయ శానిటరీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాలర్ శేషాద్రి తన డాలర్‌ను ఆ అధికారికి ఇచ్చారట, తన మరణం ముందే తెలిసిపోయిందా?