Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:25 IST)
ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి అనారోగ్య సమస్యల కారణంగా న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత ఏడు నెలలుగా ఐసియులో ఉన్నారని ఆమె కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె వయసు 84. ఆమె అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
Yamini Krishnamurthy
ముంగర యామిని కృష్ణమూర్తి డిసెంబర్ 20, 1940న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జన్మించారు. ఆమె భటనాట్యం  కూచిపూడి స్టైల్స్ ఆఫ్ డ్యాన్స్‌లో నిష్ణాతురాలు. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినప్పటికీ, ఆమె తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. ఆమె తొలి ప్రదర్శన 1957లో మద్రాసులో జరిగింది. 
 
ఈమె కూచిపూడి నాట్య టార్చ్ బేరర్‌గా మాత్రమే కాకుండా టీటీడీ ఆస్థాన నర్తకి కూడా. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో రాణించిన ఆమె పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక అత్యున్నత పౌర పురస్కారాలను కూడా గెలుచుకున్నారు.
 
ఆమె గొప్ప ప్రతిభను గుర్తించి సాంబవి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆమెను నాట్య శాస్త్ర అవార్డుతో సత్కరించింది. ఆమె న్యూ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అనే డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించి యువ డ్యాన్సర్‌లకు పాఠాలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments