కేరళ రాష్ట్రంలోని వయనాడ్‍లో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో మలయాళ నటుడు మోహన్‌లాల్ పర్యటించారు.
మోహన్‌లాల్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్‌లాల్, అక్కడ అధికారులతో మోహన్‌లాల్ భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ముండక్కై, చుర్‌ములాల్ సహా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్‌లాల్ పరామర్శించనున్నారు. ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్ లాల్.. కేరళ సీఎం సహాయ నిధికి రూ.3 కోట్ల విరాళంగా కూడా అందించారు. ఈ మొత్తాన్ని తన తల్లిదండ్రుల పేరుతో నెలకొల్పిన విశ్వశాంతి చారిటబుల్ ట్రస్ట్ తరపున అందజేయనున్నట్టు తెలిపారు.