కొత్తిమీర కట్టలను డ్రైనేజీ నీటిలో కడిగిన వ్యాపారి.. (వీడియో వైరల్)

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (18:02 IST)
Bhopal
ఆకుకూరలు, పౌష్టికాహారమైన కూరగాయలు తినాలని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. కానీ.. వ్యాపారం నిర్వహించే కొంతమంది కక్కుర్తికి ఆశపడి…పాడు పనులు చేస్తుంటారు. కల్తీలు చేయడంలాంటి పనులకు పాల్పడుతుంటారు. ఆరోగ్యానికి ఎంతో దోహదపడే.. ఆకుకూరల విషయంలో ఇలాగే చేస్తుంటారు. 
 
ఓ వ్యాపారి కొత్తిమీర కట్టలను మురికినీటిలో కడిగిన ఘటనపై భోపాల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కూరగాయల విక్రేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
వివరాల్లోకి వెళితే..భోపాల్ లోని ఓ ప్రాంతంలో కూరగాయలు విక్రయించే ఓ వ్యాపారి పక్కనే ఉన్న డ్రైనేజీ నీటిలో కొత్తిమీర కట్టలను కడగడం ఓ వ్యక్తి కంటపడింది. వెంటనే దానిని వీడియో తీశాడు. వీడియో తీస్తున్నా..ఆ యువ వ్యాపారి భయపడలేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ.. వీడియో తీయవద్దని.. తన దగ్గర ఎవరూ కొనరని వీడియోలో చెప్పడం వినిపించింది. sudhirdandotiya అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. 
 
అందులో భోపాల్ కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులకు హ్యాష్ ట్యాగ్ చేశారు. దీంతో ఆ వీడియో భోపాల్ కలెక్టర్ Avinash Lavania దృష్టికి చేరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…వెంటనే చర్యలు తీసుకోవాలంటూ..ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పోస్టు చేస్తూ..పలువురు ఉన్నతాధికారులకు హ్యాష్ ట్యాగ్ చేశారు. అతడిని గుర్తించాలని పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ సంబంధించిన శాఖను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments