Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ తినండి.. రూ.20వేలు గెలవండి

Advertiesment
10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ తినండి.. రూ.20వేలు గెలవండి
, గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:56 IST)
10 kg kathi roll
ఢిల్లీకి చెందిన ఓ స్ట్రీట్ ఫుడ్ ఓనర్ అదిరే ఫుడ్ ఛాలెంజ్ విసిరాడు. తన ఛాలెంజ్‌ను సక్సెస్ ఫుల్ చేస్తే రూ.20,000లు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి ఇంతకీ ఆయన విసిరే ఆ ఫుడ్ ఛాలెంజ్ ఏంటి అనే దానిపై తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే, ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్‌ స్టాల్‌ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కాథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే రూ.20,000 ఇస్తానని పుడ్‌ లవర్స్‌కి బంఫర్‌ ప్రకటించాడు. 
 
ఇక ఆ రోల్‌ మేకింగ్‌ వీడియోని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఛాలెంజ్‌కి ఎవరైనా రావచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి దాంట్లో 30 గుడ్లు ఆమ్లెట్‌గా వేశాడు. ఆ తరువాత నూడుల్స్, కబాబ్స్, సోయా ఛాప్‌తో మస్తుగా కళ్లనిండుగా తయారుచేశాడు ఆ కాథీ రోల్ . దాన్ని ఓ సిల్వర్ పేపర్ లో చుట్టు 'రండీ ఇది తినండీ రూ. 20వేలు గెలుసుకోండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు.
 
ఆ రోల్ చూస్తుంటే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. తినాలని ట్రై చేస్తే మాత్రం అయ్యే పనిలా కనిపించట్లేదు. పది కేజీలను ఎలా తినడం రూ.20 వేలను ఎలా గెలుచుకోవడం అని చాలామంది అనుకుంటున్నారు. దీన్ని తయారు చేసే విధానాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి పుడ్‌ లవర్స్‌ని నోరూరిస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ మంత్రులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు