Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకా కార్యక్రమం ప్రారంభించిన వేదాంత

Webdunia
సోమవారం, 31 మే 2021 (17:31 IST)
తమ ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సుకు భరోసానందిస్తూ వేదాంత ఇప్పుడు మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను దేశ వ్యాప్తంగా ఆరంభించింది. తద్వారా తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములకు టీకాలను అందించనున్నారు.
 
ఈ కంపెనీ 50 వేల మోతాదుల టీకాలను అందుకోవడంతో పాటుగా వాటిని ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు పలు యూనిట్ల వద్ద వేయడం జరిగింది. వేదాంత ఇప్పుడు అదనంగా మరో 2 లక్షల టీకా మోతాదులను సమీకరించుకోవడంతో పాటుగా టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1.2 లక్షల మందికి టీకాలను వేయనున్నారు.
 
వేదాంత ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ, ‘‘వేదాంతలో ప్రతి ఉద్యోగి భద్రత, శ్రేయస్సుతో పాటుగా వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి కూడా తాము అమిత ప్రాధాన్యతనిస్తుంటాం. మా టీకా కార్యక్రమం ద్వారా 100% ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు టీకా వేశామనే భరోసా అందించాలనుకుంటున్నాం. దేశంలో జరుగుతున్న టీకా కార్యక్రమానికి తమ వంతు తోడ్పాటునందించడానికి కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
ఇదే సమయంలో తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మరింత భద్రతను అందిస్తూ అత్యుత్తమ శ్రేణి టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని సైతం సంస్థ అందిస్తుంది. ఈ పాలసీ ద్వారా ఐదు సంవత్సరాల వార్షిక జీతానికి ఐదు రెట్ల కవరేజీని ఉద్యోగులకు అందిస్తారు. దీనితో పాటుగా ఆరోగ్య బీమా కవరేజీని సైతం 1.5 రెట్లు వృద్ధి చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 10 వేదాంత కేర్స్‌ ఫీల్డ్‌ ఆస్పత్రులను కోవిడ్‌ రోగుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments