Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ గాంధీకి కరోనా పాజిటివ్ - ఎన్నికల ప్రచారానికి బ్రేక్

Webdunia
ఆదివారం, 9 జనవరి 2022 (14:36 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన యువ నేత వరుణ్ గాంధీకి కరోనా వైరస్ సోకింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయన ఫిలిబిత్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనాబారినపడ్డారు. తనకు తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని, స్వయంగా వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం  కూడా సాగుతోంది. అందువల్ల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలకు ఎన్నికల సంఘం ముందుగా వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
ఏపీలో 28కి చేరిన ఒమిక్రాన్ కేసులు  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కు చేరింది. ఈ కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,009 కేసులు నమోదుకాగా, తర్వాత స్థాంలో ఢిల్లీ 513 కేసులతో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో 123 ఒమిక్రాన్ కేసులు ఉండగా, కర్నాటకలో 441, రాజస్థాన్ రాష్ట్రంలో 373, కేరళలో 333, గుజరాత్‌లో 204 చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 1,409 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
దేశంలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు 
మరోవైపు, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి 40,863 మంది కోలుకున్నారు. ఈ కొత్త కేసులతో కలుపుకంటే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,53,603కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments