దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇదిలావుంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారిక నివాసంలో జరిపిన కోవిడ్ పరీక్షల్లో 40కి కరోనా వైరస్ సోకింది.
ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. నిజానికి రెండు మూడు రోజుల క్రితం వరకు ఈ రాష్ట్రంలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు లేవు. కానీ, ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
ఇదిలావుంటే, సీఎం కార్యాలయ సిబ్బందిని కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసుల తీవ్ర దృష్ట్యా మరో కొద్ది రోజుల పాటు సీఎంను మరో ఇంటికి మార్చాలని అధికారులు సూచించినట్టు సమాచారం. దీంతో సీఎం కోసం పాట్నాలోనే మరో ఇంటిని గాలిస్తున్నారు.