ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,568 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 122 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇందులో కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
									
										
								
																	
	 
	మరోవైపు, రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో కరోనా నుంచి 103 మంది కోలుకున్నారు. అయితే, విశాఖలో మాత్రం ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయి.