Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్ ధామ్ యాత్రలో విషాదం: 12రోజుల్లోనే 31 మంది యాత్రికుల మృతి

Webdunia
శనివారం, 14 మే 2022 (21:09 IST)
చార్ ధామ్ యాత్రలో విషాదం నెలకొంది. 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం అనారోగ్య సమస్యలే. మే నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రలో ఈ విషాదం నెలకొంది. బీపీ, గుండెనొప్పి, మౌంటెన్ సిక్ నెస్ వంటి వాటితో 12 రోజుల్లోనే 31 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 
 
యాత్రికుల మృతి నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆరోగ్యంగా ఉన్నవారినే తీర్థయాత్రలకు అనుమతించే విధంగా వైద్య పరీక్షలను ప్రారంభించింది. 
 
అటు, అనారోగ్యంతో ఉన్న వారు, కోలుకున్న తర్వాతే యాత్రకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హెల్త్ స్క్రీనింగ్ చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నవారినే యాత్రకు అనుమతిస్తున్నారు.
 
యాత్రలోని పలు ప్రాంతాల్లో హెల్త్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆరోగ్యంగా ఉన్నవారినే యాత్రను కొనసాగించేందుకు అనుమతిస్తున్నామని డాక్టర్ భట్ వెల్లడించారు. 
 
అలాగే, పండుకేశ్వర్ దగ్గర మరో హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. దోబట, హైనా, బద్రినాథ్ దామ్ యాత్రికుల కోసం ఈ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. 
 
ఈ స్క్రీనింగ్‌లో యాత్రికుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే.. రెస్ట్ తీసుకోవాలని లేదా ఆరోగ్యంగా, ఫిట్ గా అయ్యాకే యాత్రకు వెళ్లాలని సూచిస్తున్నారు. 
 
మే 3న భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ప్రారంభంతో చార్ ధామ్ యాత్ర మొదలైంది. పరమ శివుడు కొలువైన కేథార్ నాథ్ మే 6న పున:ప్రారంభించారు. ఇక మే 8న బద్రినాథ్‌ను రీఓపెన్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం