వ‌ల‌స ప‌క్షులు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటాయి..

Webdunia
శనివారం, 14 మే 2022 (20:19 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వ‌ల‌స ప‌క్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి. పోతుంటాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయన్నారు. 
 
ఇవాళ ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వం కావ‌డం యాదృచ్ఛిక‌మ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగుల‌ను హ‌రీష్ రావు ట్వీట్ చేశారు. ఇలా పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ సెటైర్​ తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్​ మారింది.
 
బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. 
 
అంతకుముందే అమిత్‌షాకు మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణపై బీజేపీకి కక్ష, వివక్ష అలానే ఉందని మంత్రి ఆరోపించారు. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తెలంగాణపై బీజేపీది అదే కక్ష. ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదు. ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు ఇదే బీజేపీ కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments