Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ అల్లర్లకు మూలకారకుడు అమిత్ షానే : శరద్ పవార్

Advertiesment
amith shah - sarath pawar
, ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:50 IST)
ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ జయంతి వేళ అల్లర్లు చోటుచేసుకున్నాయి. వీటిపై శరద్ పవార్ స్పందించారు. 
 
ఈ అల్లర్లను ఆపడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ, అక్కడి పోలీసులు కేంద్ర హోం శాఖా మంత్రి పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉందన్నారు. అందుకే ఈ ఆల్లర్లకు పూర్తి బాధ్యుడు అమిత్ షా మాత్రమేనని చెప్పారు. 
 
ఢిల్లీలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా అది యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది, చూస్తుందన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రలేకపోవడం ఆ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11 యేళ్ల బాలికపై ఆరుగురు మైనర్ల అత్యాచారం