Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్దోషులై బయటకు వచ్చిన వారిని మళ్లీ పట్టుకున్న చనిపోయిన గుర్రం కేసు

horse
, మంగళవారం, 10 మే 2022 (10:51 IST)
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ గుర్రం మృతిపై నైనిటాల్ హైకోర్టు మరోసారి పిటిషనర్ నివేదికను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించి ఈ కేసులో నిర్దోషులై బయటకు వచ్చినవారికి షాకిచ్చింది. ఈ కేసులో నిర్దోషులుగా విడుదలైన ఐదుగురిపై కేసు నమోదు చేసి ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను సమర్పించాలని డెహ్రాడూన్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును పిటిషనర్ అభ్యర్థించారు.

 
ఈ అంశంపై జస్టిస్ అలోక్ కుమార్ వర్మ సింగిల్ బెంచ్ ముందు విచారణ జరిగింది. మార్చి 14, 2016న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీజేపీపై హోషియార్ సింగ్ బిష్త్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు జరిగిన ఘటన ప్రకారం... రిస్పానా నదిపై ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో పోలీసుల శక్తిమంతమైన గుర్రానికి కాలు విరిగింది.

 
గుర్రం కాలు తెగిపోయి కృత్రిమ అవయవాలు అమర్చినా దాని ప్రాణాలు కాపాడలేకపోయాయి. ఇసుక దందాలో గణేష్ జోషి, ప్రమోద్ బోరా, జోగేంద్ర సింగ్ పుండిర్, అభిషేక్ గౌర్, రాహుల్ రావత్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం రెండుసార్లు కోర్టులో దరఖాస్తు చేసుకున్నా కోర్టు కేసు ఉపసంహరణకు అనుమతించలేదు. కొంతకాలం తర్వాత నిందితులకి బెయిల్ వచ్చింది. 23 సెప్టెంబర్ 2021న, డెహ్రాడూన్ CJM కోర్టు ఈ ఐదుగురు నిందితులను సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది.

 
ఐతే నిందితులు జంతు హింసకు పాల్పడ్డారని పిటిషనర్‌ వాదించారు. వీరికి వ్యతిరేకంగా చాలా సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ సాక్ష్యాలు లేవని ట్రయల్ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించిందని ఆయన వాదించారు. గుర్రాన్ని హింసించినదానిపై పోలీసుల వద్ద వీడియోగ్రఫీ కూడా ఉందనీ, అందువల్ల, వారిపై కేసు నమోదు చేయడానికి, డెహ్రాడూన్‌లోని CJM కోర్టు నుండి కేసుకు సంబంధించిన అన్ని ఫైల్‌లను వారికి ఇవ్వాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Asani cyclone: శ్రీకాకుళం, విజయనగం, వైజాగ్‌లలో భారీ వర్షాలు