Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (14:22 IST)
తన కుమార్తెకు కాబోయే భర్తతో ఓ మహిళ (అత్త) పారిపోయింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో వారం క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వప్న అనే మహిళ తనకు కాబోయే అల్లుడు రాహుల్‌తో వెళ్లిపోయింది. తాజాగా స్వప్న, రాహుల్ పోలీసుల ముందుకు వచ్చారు. ఇద్దరూ పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు. 
 
తన భర్త బాగా తాగి వచ్చినను కొట్టేవాడని, తన కుమార్తె కూడా తనతో తరచుగా గొడవలు పడేదని స్వప్న తెలిపింది. అందుకే రాహుల్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, అతనితో ఉంటానని తెలిపింది. తన కుటుంబ సభ్యుల చెబుతున్నట్టు తాను రూ.4 లక్షల డబ్బులు, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం తీసుకెళ్లలేదని చెప్పింది. తన మొబైల్ ఫోన్ రూ.200 మాత్రమే తీసుకెళ్లాలని తెలిపింది. 
 
రాహుల్ మాట్లాడుతూ, అలీఘర్ బస్టాండ్‌కు రాకపోతే ప్రాణాలు తీసుకుంటానని స్వప్న బెదిరించిందని, అందుకే తాను వెళ్లానని చెప్పాడు. తొలుత తాము లక్నోకు వెళ్లామని తెలిపాడు. అక్కడి నుంచి ముజఫర్ నగర్‌కు వెళ్లామని, తమ గురించి పోలీసులు వెతుకుతున్నారని వార్త తెలిసిన తర్వాత వెనక్కి వచ్చేశామని చెప్పాడు. స్వప్నను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. 
 
మరోవైపు, స్వప్న సోదరుడు మాట్లాడుతూ, ఆమెను ఇంట్లోకి రానిచ్చేది లేదని స్పష్టచం చేశాడు. తీసుకెళ్లిన డబ్బులు, నగలు ఇచ్చేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించాడు. స్వప్నను తన బావ కొట్టేవాడన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments