Webdunia - Bharat's app for daily news and videos

Install App

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (13:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. 11 యేళ్ల మూగ, చెవిటి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగికదాడి తర్వాత ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో పడివుండగా, గ్రామస్థులు గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడుని గుర్తించారు. ఆ తర్వాత నిందితుడుని అరెస్టు చేసేందుకు వెళితే పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరుపగా నిందితుడుకి బుల్లెట్ గాయమైంది. 
 
బాధితురాలి కుటుంబ సభ్యుల మేరకు... బాధిత చిన్నారి మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా, బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో నగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్టు గుర్తించారు. నిందితుడుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపాడు. 
 
ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు డాన్ సింగ్ కాలికి బుల్లెట్ గాయమైందని రాంపూర్ ఎస్వీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. నిందితుడు బాలికతో ఆమె ఇంటివద్ద మాట్లాడి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తంది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. అలాగే, ఆమె ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చినమచ్చలు ఉన్నట్టు  వైద్యులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments