Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్‌తో కలిసి యువతిని రేప్ చేసిన బీజేపీ నేత.. అరెస్టును తప్పించుకునేందుకు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కంటికి కనిపించిన యువతులపై కన్నేస్తున్నారు. తాజాగా తన కారు డ్రైవర్‌తో కలిసి ఓ యువతిని బీజేపీ నేత ఒకరు సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 30 జులై 2018 (13:13 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కంటికి కనిపించిన యువతులపై కన్నేస్తున్నారు. తాజాగా తన కారు డ్రైవర్‌తో కలిసి ఓ యువతిని బీజేపీ నేత ఒకరు సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అరెస్టును తప్పించుకునేందుకు కారు డ్రైవర్‌కిచ్చి బలవంతపు పెళ్లి చేశాడు. కొద్ది రోజులు కాపురం చేశాక.. ఆ కారు డ్రైవర్ చెప్పాపెట్టకుండా పారిపోయాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్ నగరానికి చెందిన విక్కీ తనేజా అనే వ్యక్తి స్థానికంగా బీజేపీ నేతగా చెలామణి అవుతున్నాడు. ఈయన తన డ్రైవరు జైబ్‌తో కలిసి ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అరెస్టు నుంచి తప్పించుకునేందుకు డ్రైవరుతో పెళ్లి చేయించాడు. అదీ బలవంతంగా ఈ వివాహాన్ని జరిపించాడు. పెళ్లి అనంతరం ఆరునెలల తర్వాత బీజేపీ నేత డ్రైవరు బాధిత మహిళను వదిలి వెళ్లిపోయాడు. 
 
దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరట్ పోలీసులు బీజేపీ నాయకుడితోపాటు అతని డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారం జరిపి జైలు పాలైన ఘటన మరవక ముందే మీరట్‌లో మరో ఘటన జరగడం సంచలనం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments