Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం ఇవ్వలేదని భార్యను చంపేసిన భర్త.. యూపీలో దారుణం

తన పెళ్లికి ఖర్చు చేసిన మొత్తంలో 15 లక్షల ను కట్నం కింద ఇవ్వనందుకు కట్టుకున్న భార్యను కసాయి భర్త చంపేశాడు. అదీ కూడా పెళ్లయిన కేవలం 10 రోజులకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో

Webdunia
ఆదివారం, 6 మే 2018 (13:37 IST)
తన పెళ్లికి ఖర్చు చేసిన మొత్తంలో 15 లక్షల ను కట్నం కింద ఇవ్వనందుకు కట్టుకున్న భార్యను కసాయి భర్త చంపేశాడు. అదీ కూడా పెళ్లయిన కేవలం 10 రోజులకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షార్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. యూపీకి చెందిన రవికాంత్‌గిరితో పింకి(ఢిల్లీ)కి పది రోజుల క్రితం వివాహమైంది. అయితే రవికాంత్ తన పెళ్లి పేర రూ.20 లక్షలు ఖర్చు చేశాడు. 
 
దీంతో రూ.15 లక్షలు కట్నం కింద ఇవ్వాలని భార్య పింకిని వేధింపులకు గురిచేశాడు. శుక్రవారం రాత్రి ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫోన్ చేసి.. తన భార్యను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు హత్య చేశారంటూ పోలీసులను నమ్మించాడు. 
 
ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో రవికాంత్‌ను పలు కోణాల్లో విచారించారు. మొత్తానికి పింకిని తానే హత్య చేసినట్లు భర్త రవికాంత్ ఒప్పుకున్నాడు. ఈ కేసులో రవికాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
మరోవైపు, బీహార్‌లో దారుణం జరిగింది. ఒక అమ్మాయి మరో అమ్మాయితో స్వలింగసంపర్కం కొనసాగిస్తుందని కొందరు యువకులు అనుమానం పెట్టుకున్నారు. దీంతో ఆ అమ్మాయిని ఒక పోల్‌కు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి వైరల్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments