Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేవుడు సోనూసూద్ అంటున్న ఆ తండ్రీకూతుళ్లు... ఉత్తరప్రదేశ్ ప్రగ్యాకు నడక దానం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (15:55 IST)
ఎంతోమంది యవ హీరోలు పలువురికి సహాయం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ వరుసలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకొని పోయిన ఎంతోమందిని సోనూసూద్ తాను సహాయం అందించి వారిని స్వంత రాష్ట్రాలకు తరలించి ఆదుకున్నారు.
 
అదే కోవలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రగ్య(22) న్యాయ విద్యార్థి గడగచిన 6 నెలల క్రితం ఓ రోడ్డు యాక్సిడెంటులో తీవ్ర గాయాలై తన రెండు కాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేనందున సహాయం కోసం తన తండ్రి విజయ్ మిశ్రా తమ బంధువులు, పలువురు రాజకీయ నాయకులను అనుసరించి సహాయం కోరారు.

పైగా వైద్యులు చికిత్స నిమిత్తం తమ కూతురు కోలుకోవాలంటే సర్జరీ తప్పనిసరి, ఇందుకోసం సుమారు ఒకటిన్నర లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో ఆగస్టు మొదటి వారంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు తమ కుమార్తెను ఆదుకోవాలని ట్విట్ చేశారు.
 
సమాచారం అందుకున్న సోనూసూద్ వెంటనే డిల్లీలోని ఓ వైద్య సంస్థ యందు ప్రగ్యాకు చికిత్స ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా తమ బృందాన్ని పంపించి ప్రగ్యా చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాటును చేయమన్నారు. సోనూసూద్ సహాయంతో ప్రగ్యా కోలుకుని సర్జరీ ద్వారా ప్రస్తుతం నడవడం ప్రారంభించారు. ప్రగ్యా తండ్రి మరియు ప్రగ్యా, తనకు నడక దానం అందించిన సోనూసూద్ తనకు దేవుడి లాంటివారని అనుక్షణం ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments