Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం.. దళిత బాలుడిని కొట్టి కాళ్లు నాకించిన వైనం...

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ దళిత బాలుడిని చితకబాదిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత తమ కాళ్లు నాకించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో దళిత బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తల్లి నిందితుల్లోని ఓ యువకుడి పొలాల్లో కూలీ పనులకు వెళ్లేది. గత కొన్ని రోజులుగా దినకూలీ ఇవ్వలేదు. దీంతో ఆ బాలుడు కూలీ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అంతే.. కొందరు యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
ఆ బాలుడిని మొదట బెల్టుతో కొట్టారు. ఆ తర్వాత కూడా వదిలిపెట్టలేదు. కాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు ఏడుస్తూ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినప్పటికీ వదిలిపెట్టలేదు. ఆ సమయంలో భయపడిపోతున్న ఓ దళితబాలుడిని చూస్తూ కొందరు గట్టిగా నవ్వారు. ఇంటువంటి తప్పు మరోమారు చేస్తావా? అంటూ గద్దించారు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో నిందితులు ప్లేటు మార్చారు. ఆ బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్టు ఆరోపిస్తున్నారు. వాళ్లు కొట్టే దెబ్బలు తాళలేక వారు చేసిన ఆరోపణలను ఆ బాలుడు అంగీకరించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన యూపీ పోలీసులు  కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments