Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలుడిని ప్రేమించిన యువతి.. ఇద్దరినీ నరికి చంపిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:32 IST)
ఓ యువతి, మైనర్ బాలుడు ప్రేమించుకున్నారు. కానీ వారి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.అయినప్పటికీ వారి మధ్య లవ్ ఎఫైర్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఒకే ఇంట్లో బంధించి ఉన్న యువతిని, మైనర్ బాలుడిని ఆమె తండ్రి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి.. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మైనర్ బాలుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. మైనర్ బాలుడికి దూరంగా ఉండాలని ఆమెను బెదిరించారు. అయితే ఆమె మాత్రం వారి మాటలు పట్టించుకోలేదు. దీనిపై ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువతి తండ్రి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయేవాడు.
 
శనివారం యువతి తల్లిదండ్రులు, సోదరుడు పెళ్లికి హాజరుకావడానికి వేరే ఊరికి వెళ్లారు. ఆ సమయంలో యువతి ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు.. యువతి ఇంటికి వచ్చాడు. ఈ విషయం గమనించి యువతి బంధువు ఒకరు.. వారు ఇంట్లో ఉన్న సమయంలో బయట నుంచి గదికి తాళం వేశాడు. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేశాడు.
 
మరోవైపు ఆదివారం రోజు బాలుడు కనిపించకపోవడంతో.. అతని తండ్రి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువు.. బాలుడిని ఇంట్లో ఉంచి తాళం వేసిన సంగతి గురించి అతని తండ్రికి తెలియజేశాడు. యువతి తండ్రి వచ్చాక ఆ గది తలపులు తెరవనున్నట్టు చెప్పాడు. దీంతో కంగారు పడిపోయిన బాలుడి తండ్రి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళన చెందాడు. పోలీసులకు కూడా ఈ విషయంపై సమాచారం అందించాడు.
 
ఇక, మరోవైపు ఇంటికి చేరుకున్న యువతి తండ్రి.. క్షణాల్లో లోనికి వెళ్లాడు. అనంతరం లోపలి నుంచి గదిని లాక్ చేశాడు. ఇక, అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బద్దలు కొట్టి గది తలుపులు తెరిచారు. అక్కడ యువతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. యువతి తండ్రి గొడ్డలితో కూతురిని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను నరికి చంపాడు. 
 
ఈ ఘటనతో షాక్ తిన్న పోలీసులు.. యువతి తండ్రిని అరెస్ట్ చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే అతడు హత్యకు వినియోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

Mad Gang: నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా మ్యాడ్ స్క్వేర్ : మ్యాడ్ గ్యాంగ్

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments