శ్రీదేవి కూతురు జాన్వి తెలుగులో అడుగుపెడుతోంది. ఈ మాట చాలాకాలం నుంచి వింటూనే ఉన్నాం. పలానా సినిమాలో పలానా హీరోతో జత కలుస్తోందంటూ ప్రచారం నడుస్తోంది. కానీ ఇంతవరకు తెలుగు వైపు చూడలేదు. అయినా ఈ అమ్మడు తెలుగు ఎంట్రీ వార్తలు మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం జాన్వీ ఏ తెలుగు హీరో పక్కన నటిస్తోందో తెలుసా..?
శ్రీదేవి కూతురు జాన్వి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుందన్న వార్త బయటకు వచ్చిందో లేదో.. జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్లో చిరంజీవి వారసుడు రామ్ చరణ్, జాన్వీలు జత కలుస్తారన్న ప్రచారం బాగానే సాగింది. అయితే జాన్వి హిందీ మూవీ దఢక్‌తో తెరగేట్రం చేసింది.
ఇంతవరకు బాలీవుడ్ తప్ప మరో లాంగ్వేజ్ లోకి అడుగుపెట్టలేదు ఈ భామ. జాన్వి తొలి చిత్రం దఢక్ హిట్ అయినా అనుకున్నంత క్రేజ్ దగ్గలేదు. శ్రీదేవి, బోనీకపూర్ కూతురిగా వారసత్వం బాక్ డ్రాప్‌తో అవకాశాలొచ్చినా స్టార్ కాలేకపోయింది జాన్వి. తను చేసిన సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ కావడంతో జాన్వికి వచ్చిన గుర్తింపు అంతంతమాత్రమే.
ఈ క్రమంలో ఈ అమ్మడు మనస్సు సౌత్ వైపు, ముఖ్యంగా తెలుగు సినిమాలపై పడిందట. తెలుగులో నటిస్తే చాలు స్టార్డమ్ వస్తుందన్న నమ్మకంతో ఉంది జాన్వి. త్రివ్రిక్రమ్ జాన్విని సంప్రదించాడని చెప్పుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తుందన్న ప్రచారం నడిచింది.
అదలావుండగానే మహేష్ మూవీ హీరోయిన్‌గా జాన్వి పేరు బయటకు వచ్చింది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇందులో నటిస్తుందేమోనన్న టాక్ వినబడుతోంది. మరోవైపు బోనీ కపూర్ కూడా ఈ మధ్య దక్షణాదిలో వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. శ్రీదేవి అంటే తెలుగు పరిశ్రమలో చాలా గౌరవం. ఈ క్రమంలో జాన్విని తెలుగు సినిమాల్లో పరిచయం చేస్తారేమో చూడాలి.