Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో పోటీ కోసం 45 యేళ్ళ వయసులో పెళ్లి... ఎక్కడ?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:51 IST)
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకునేందుకు ఏ వ్యక్తి 45 యేళ్ళ వయసులో వివాహం చేసుకున్నాడు. ఈ స్థానం పురుషులకు కేటాయించకపోయినప్పటికీ.. తన కొత్త భార్యను పోటీకి దింపాలన్న ఏకైక ఉద్దేశ్యంతో ఈ వివాహం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని బాలియా జిల్లాలోని క‌ర‌ణ్‌చ‌ప్రా గ్రామానికి చెందిన హ‌థీ సింగ్(45) ద‌శాబ్ద కాలంగా ప్రజా సేవలో నిమగ్నమైవున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను విజ‌యం వ‌రించ‌లేదు. 
 
గ్రామం అభివృద్ధికి పాటు ప‌డుతున్న అత‌ను ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేద్దామని భావించాడు. అయితే, ఆ స్థానం మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేశారు. దీంతో ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, స‌హ‌చ‌రుల సూచ‌న మేర‌కు పెళ్లి చేసుకున్నాడు. ఖచ్చితంగా హ‌థీ సింగ్ భార్య‌నే గెలిపిస్తామ‌ని గ్రామ‌స్తులు అంటున్నారు.
 
ఈ సంద‌ర్భంగా హ‌థీ సింగ్ మాట్లాడుతూ.. త‌న గ్రామానికి మూడో ద‌శ‌లో భాగంగా ఏప్రిల్ 26న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేష‌న్ స‌మ‌ర్పించాలి. అందుకే మంచి ముహుర్తం లేన‌ప్ప‌టికీ పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది. 
 
త‌న భార్య డిగ్రీ ప‌ట్ట‌భ‌ద్రురాలు అని తెలిపాడు. అస‌లు త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశ‌మే లేదు. కానీ గ్రామ అభివృద్ధి కోస‌మే పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని హ‌థీ సింగ్ పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments