Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్య పెళ్లికొడుకు.. తొమ్మిదిమంది భార్యలు.. వ్యభిచారం చేయమంటూ వేధింపులు!

Advertiesment
Man
, బుధవారం, 31 మార్చి 2021 (19:25 IST)
విశాఖలో నిత్య పెళ్ళి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకుని.. వారిని వ్యభిచారం కూపంలోకి దింపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

విశాఖలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో అతని అరాచకాలు ఆగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యల్ని వ్యభిచారం చేయమంటూ ప్రతీరోజు వేధించాడు. కాదని అంటే హింసలకు పాల్పడుతున్నాడు.
 
అరుణ్ కుమార్‌కు గంజాయి, వ్యభిచారం చేసే ముఠాలతో సంబంధాలున్నాయి. దీంతో డబ్బు సంపాదన కోసం ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకోవటమే కాకుండా వారిని వ్యభిచారం చేయాలని వేధిస్తున్నాడు. భార్యలతోనే కాకుండా అరుణ్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన అమ్మాయిని కూడా వ్యభిచారం చేయాలని వేధిస్తున్నాడు. తను చెప్పిన మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. 
 
కేవలం బెదిరింపులే కాకుండా కత్తులు, తుపాకిలకు చూపెట్టి నేను చెప్పినట్లు వినకపోతే చంపిపారేస్తానంటూ వేధించాడు. దీంతో అరుణ్ కుమార్ మొదటిభార్య కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతనికి గంజాయి, వ్యభిచారం చేసే ముఠాలతో సంబంధాలున్నట్లుగా గుర్తించారు.
 
అరుణ్ కుమార్ అరాచాలకు తెలుసుకున్న మిగిలిన భార్యలు కూడా మహిళా సంఘాలను ఆశ్రయించారు. తమకు న్యాయంచేయమని..అరుణ్ కుమార్ అరాచకాల నుంచి తమను రక్షించమని వేడుకున్నారు. కాగా..అరుణ్ కుమార్ వల్ల మోసపోయిన భార్యలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదనీ.. పోలీసులకు అరుణ్ కుమార్ కు సంబంధాలున్నాయని అందుకే అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవటం లేదని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 
 
పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే బాధిత మహిళలు సీపీకి వాయిస్ మెసేజ్ పెట్టారని మహిళాసంఘం నేతలు తెలిపారు. అరుణ్ కుమార్‌కు తగిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో రోజూ వెయ్యి కేసులు.. 24 గంటల్లో 11,840 కేసులు