టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, సినీనటి అనుష్క శర్మ జీరో సినిమా తర్వాత కొంతకాలం నటజీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎల్ ఆనంద్ రాయ్ తీస్తున్న జీరో సినిమా తర్వాత తన కొత్త సినిమా గురించి అనుష్క ఇంకా ప్రకటన ఏదీ చేయలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడి ఆడపిల్లకు జన్మనిచ్చిన అనుష్క తన ప్రొడక్షన్ హౌస్ పనులను చూసుకుంటూనే తన బిడ్డ బాగోగులను స్వయంగా పట్టించుకుంటోంది.
కరోనా లాక్ డౌన్ కాలంలో బుల్ బుల్ మరియు పాతాళ్ లోక్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను నిర్మించిన అనుష్క శర్మ గతంలో సిమీ గర్వాల్ పాపులర్ షోలో పాల్గొన్న వీడియో క్లిప్ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటానని.. పెళ్లాడినట్లయితే ఆపై తాను పనిచేయకూడదని అనుకుంటున్నాను అని అనుష్క చెప్పింది. గ్రేజియా మేగజైన్‍కి ఇచ్చిన మరొక ఇంటర్యూలో సినిమాలకు తాను ఎందుకు విరామం ఇవ్వాలనుకున్నది కూడా అనుష్క బయటపెట్టింది.
ఇకపోతే.. 2018లో వరుణ్ ధావన్‌తో కలిసి సూయి దాగా సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి జీరో సినిమాలో నటించిన అనుష్క ఇప్పుడు ఒక సినిమా చేస్తోంది. పైగా ఆమె ప్రొడక్షన్ కంపెనీ అయిన క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ త్వరలో మాయి అనే పేరున్న సీరీస్‌ని నెట్ ప్లిక్స్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికైతే తన తదుపరి చిత్రాల గురించి అనుష్క అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఏప్రిల్ చివరినాటికి ఆమె తిరిగి నటనా వృత్తిలోకి అడుగుపెడుతుందని భావిస్తున్నారు.