Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి కరోనా

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (14:33 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా యూపీ విద్యాశాఖ మంత్రి గులాబ్ దేవికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు.
 
గత రెండు రోజులుగా దగ్గు వస్తుండటంతో లక్నోలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఆ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని గులాబ్ దేవి తెలిపారు. అందువల్ల ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఎవరికివారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె సూచించారు.
 
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 2,886 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,878కు, మరణాల సంఖ్య 50,634కు పెరిగింది. 
 
మరోవైపు గత 24 గంటల్లో 3,980 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,03,408కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 45,622 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments