Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో ముహూర్తం.. వాట్సాప్‌లో మునిగిపోయిన వధువు.. తర్వాత?

మరికొన్ని క్షణాల్లో ముహూర్తం. మెడలో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన ఆ వధువు.. వాట్సాప్‌లో మునిగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వరుడు.. ఆ అమ్మాయితో పెళ్లి వద్దని తెగేసి చెప్పాడు.

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (15:35 IST)
మరికొన్ని క్షణాల్లో ముహూర్తం. మెడలో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన ఆ వధువు.. వాట్సాప్‌లో మునిగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వరుడు.. ఆ అమ్మాయితో పెళ్లి వద్దని తెగేసి చెప్పాడు. ముహుర్తం సమీపిస్తున్నా.. పెళ్లి కంటే వాట్సాప్ ముఖ్యమని భావించే ఇలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకుని సంసార జీవితం గడపడం కష్టమని చెప్పాడు. దీంతో ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది.
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ఓ వధువు, తన కుటుంబీకులతో కలిసి వరుడి కోసం ఎదురుచూస్తూ పెళ్లి మండపంలో ఉంది. అయితే, సరిగ్గా వరుడు కుటుంబీకులు వచ్చేసమయానికి వాట్సాప్‌లో మునిగిపోయింది.
 
దీన్ని గమనించిన వరుడు, అతని బంధువులు ఈ పెళ్లి జరగదంటూ షాకిచ్చారు. దాంతో వధువు కుటుంబీకులు ఖంగుతిన్నారు. కారణమేమిటని అడిగితే వధువు నిత్యం వాట్సాప్‌తోనే బిజీగా ఉంటున్నదని, అలాంటి అమ్మాయి తమకు వద్దని స్పష్టం చేశారు. దీంతో ఈ పెళ్లి ఆగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments