పార్కులో ఏకాంతంగా ప్రేమికులు.. ప్రేమికుడు ఆ పనిచేస్తే.. వీడియో వైరల్.. ఎలా?

సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు.. నేరాలకు పాల్పడే వారు అధికమవుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోమవారం, 3 సెప్టెంబరు 2018 (17:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చేతిలో స్మార్ట్‌ఫోనుంటే చాలు.. నేరాలకు పాల్పడే వారు అధికమవుతున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌లో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో లవర్స్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  వాట్సాప్‌లో హల్ చల్ చేస్తున్నాయి. తన ప్రియురాలితో  సన్నిహితంగా ఉన్న సమయంలో ఆ యువకుడు తన సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. ఈ దృశ్యాలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఈ యువకుడు చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ పార్కుల వెంట తిరిగేవారు. ఓ రోజు వీరిద్దరూ సన్నిహితంగా వున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇటీవల కాలంలో ఆ యువకుడి ఫోన్‌‌ను స్నేహితుడు చూశాడు.
 
ఈ ఫోనులో తన లవర్‌తో ఆ యువకుడు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను గుర్తించాడు. వెంటనే ఆ దృశ్యాలను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ దృశ్యాలను ఇతరులకు కూడా షేర్ చేశాడు. దీంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రూ.999కే విమాన ప్రయాణం.. ఫెస్టివల్ సేల్... బుకింగ్స్ ప్రారంభం